కేసీఆర్ అందుకే అసెంబ్లీకి రావట్లేదు: మంత్రి కోమటిరెడ్డి
16-12-2024 04:20 PM
హైదరాబాద్: అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకే.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఐదుగురు సభ్యులు ఉన్నప్పుడు కూడా భట్టి విక్రమార్క అసెంబ్లీకి వచ్చారని గుర్తుచేశారు. 30 మంది సభ్యులు ఉన్నా కేసీఆర్ ఎందుకు రావట్లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు, కవితను తాము పట్టించుకోమన్నారు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానం, సీఎందే నిర్ణయం అన్న కోమటిరెడ్డి పాలమూరు నుంచి వాకటి శ్రీహరికి మంత్రి పదవి వస్తుందని కచ్చితంగా చెప్పగలనని జోస్యం చెప్పారు.






