15 April, 2026 | 11:19 PM

కొనసాగుతున్న పంట నష్టం సర్వే..

06-11-2025 09:33 PM

చిగురుమామిడి (విజయాక్రాంతి): భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల వరి పంటల సర్వే మండలంలోని 17 గ్రామాల్లో కొనసాగుతున్నది. మండలంలోని సుందరగిరి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని అంజలి సుందరగిరితో పాటు ఉల్లంపల్లి గ్రామంలో గురువారం నష్టపోయిన రైతుల పంట పొలాల వద్దకు వెళ్లి రైతు భరోసా యాప్ ద్వారా జిపిఎస్ తో అనుసానందించబడిన ఫోటోల ద్వారా పంట నష్టాన్ని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరి పంటలు నష్టపోయిన రైతులు తమను సంప్రదించాలని, నష్టపోయిన పంటను పరిశీలించి ఆన్లైన్ లో నమోదు చేస్తామని చెప్పారు.