calender_icon.png 6 November, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల వల్లే నవసమాజ నిర్మాణం సాధ్యం

06-11-2025 09:32:52 PM

గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ..

గజ్వేల్: ఉపాధ్యాయుల వల్లే నవ సమాజ నిర్మాణం సాధ్యమని గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ అన్నారు. గజ్వేల్ ఎంఈఓ కృష్ణ ఆధ్వర్యంలో  ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆర్డిఓ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బోధన చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అధికారులు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులేనని గుర్తు చేశారు. కార్పొరేట్ స్థాయికి ధీటుగా ధీటుగా ప్రభుత్వం పాఠ్యాంశాలను సిద్ధం చేసిందని వాటిని విద్యార్థులకు బోధించి అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు కరీముద్దీన్, ప్రధానోపాధ్యాయుల సంఘం గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు భాస్కర్, ఎస్ టిఓ గజ్వేల్ ప్రభాకర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వంటేరు సత్యనారాయణరెడ్డి,  శ్రీనివాసరెడ్డి, నాగరాజు, రవికుమార్,  ప్రశాంత్ కుమార్  విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో నుండి 34 మందిని ఉత్తమ  ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించడం జరిగింది కార్యక్రమంలో మండలంలోని అన్ని  పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.