06-11-2025 09:35:15 PM
భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ:
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య
చండూరు (విజయక్రాంతి): భారత గడ్డపై సిపిఐది వందేళ్ల చరిత్ర అని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయం మాధగోని నరసింహ భవనంలో నిర్వహించిన సిపిఐ మండల కార్యవర్గ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, భారతదేశ గడ్డపై 100 సంవత్సరాల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్మించినటువంటి పార్టీ సిపిఐ అని అన్నారు.
భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరే విముక్తికై నిరంకుశ నిజామును గద్ద దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో 3000 గ్రామాల విముక్తి పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టులని అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మం పట్టణంలో సిపిఐ శత వసంతాల ఉత్సవ ముగింపు సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు. 18వ తేదీన చండూరు మండలానికి చేరుకుంటున్న బస్సు జాతను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి తేమ శాతం లేకుండా పత్తి,వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్,జిల్లా సమితి సభ్యులు తిప్పర్తి రాములు, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, కర్నాటి వెంకటేశం బండమీది వెంకటేశం, గంట రమేష్, సి హెచ్ ఉషయ్య, ఇరిగి సంజీవ తదితరులు పాల్గొన్నారు