22-08-2025 02:21:50 AM
గచ్చిబౌలి, ఆగస్టు 21 : పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతు న్న కోటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ 2025 అండర్-19 విభాగంలో గురువారం ప్రి-క్వార్టర్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితం గా జరిగాయి. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రౌనక్ చౌహాన్ ప్రణవ్ మంజు న్పా 21-12, 21-16తో విజయం సాధించాడు.
నార్త్‌ఈ స్ట్ నుండి వచ్చిన ప్రతిభావంతుడు బోర్నిల్ ఆకాష్ చాంగ్మై ఆదిత్య త్రిపాఠిని సులభంగా మట్టికరిపించాడు. 4వ సీడ్ సూర్యాక్ష్ రావత్ అర్యన్ తల్వ్పా నేరుగా గేమ్స్‌లో గెలిచాడు. అలాగే అన్ష్ నేగి, ప్రనౌ వ్ రామ్ నగలింగం, ధ్యాన్ సంతోష్, టంకర గ్నానదత్తు తలసిల, ఇరాన్కు చెందిన అమిరాలి అహ్మద్లూ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.