22-08-2025 02:20:08 AM
కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖా మం త్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యాలకు తగినట్టుగానే విద్యుత్తు డిమాండ్‌కూడా పెరుగుతోందని, ఈ డిమాండ్‌ను తీర్చడంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తుం దన్నారు. గురువారం ఢిల్లీలోని ఒబెరా య్ హోటల్లో జరిగిన 13వ విడత కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రిఫామ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫామ్ నినాదంతో ముందుకు వెళుతోందన్నారు. ఇందులో భాగంగా 2015 తరువాత బొగ్గు రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల ప్రభా వం క్షేత్రస్థాయిలో కనపడుతున్నాయన్నారు. ఇటీవల బొగ్గు ఉత్పత్తి, పంపిణీలో ఒక బిలియన్ టన్నుల రికార్డును అధిగమించామని తెలిపారు. ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణ, కార్మికులు, బొగ్గుగని ప్రభావిత ప్రాం తాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
దేశంలో ఒకప్పుడు విద్యుత్తు కోతలతో పరిశ్రమల యాజమాన్యాలు, రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితికి ప్రధాని మోదీ సర్కా రు ముగింపు పలికిందన్నారు. దేశంలో గు ణాత్మక మార్పులు తీసుకు రావాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి.. అన్ని భాగస్వామ్య పక్షాలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
12వ విడతలో గనుల బిడ్డింగ్‌లో గెలుచుకున్న వారికి అగ్రిమెంట్లను కేంద్రమంత్రి అందించారు. కార్య క్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్‌చంద్ర దూబే, కార్యదర్శి విక్రమ్‌దేవ్ దత్, అదనపు కార్యదర్శులు రూపీందర్ బ్రార్, సనోజ్ కుమార్ ఝా పాల్గొన్నారు.