8 April, 2026 | 10:10 AM

కొనసాగుతున్న ‘పది’ రీవెరిఫికేషన్

07-05-2024 01:28 AM

ఈ నెల 15వరకు దరఖాస్తులకు అవకాశం

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదోతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం నాటి కి 135 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోసం హైదరాబాద్ డీఈవో కార్యాలయంలో అందజేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం విద్యార్థులు కోరిన ప్రకారం ఆన్సర్ షీట్లను పునఃపరిశీలించి వివిధ సబ్జెక్టులలో ఉన్న అనుమానాలను నివృ త్తి చేయనున్నట్లు తెలిపారు. కాగా రీవెరిఫికేషన్ చేయించుకోవాలనే విద్యార్థులు రూ.1,000 డీడీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.