8 April, 2026 | 8:27 AM

మల్లు రవిని గెలిపిద్దాం

07-05-2024 01:27 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, మే 6 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకుందామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 1, 2వ వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, కౌన్సిలర్ విభూతి నారాయణ పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌లో చేరికలు..

పెబ్బేర్ మండలం కంచిరావుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సుజాత తేజవర్ధన్, ఉప సర్పంచ్ భాస్కర్‌తో పాటు జనుంపల్లి ఎంపీటీసీ రాధాకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ బాలరాజు సమా 150 మంది నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడి ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.