రాష్ట్రంలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
07-05-2024 01:29 AM
హైదరాబాద్,మే 6 ( విజయక్రాంతి): కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలలతో ఇబ్బందిపడ్డ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే రెండు మూడు రోజుల్లో పలు జిల్లాల్లో 2 నుంచి 3 ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల సంఖ్య 19కి చేరుకున్నది. వడగాలులు వీచే ప్రాంతాల సంఖ్య 43 ప్రాంతాలకు చేరింది. నాలుగైదు రోజుల్లో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనితెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, జనగాం, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి ,ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.




