22-10-2025 04:49:42 PM
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో బుధవారం పోలీస్ పహారలో కల్యాణ లక్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ లోపలికి లబ్ధిదారులను తప్ప ఎవరిని రానివ్వకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైనట్టు వారికి వచ్చిన మెసేజ్ ఫోన్ కాల్ వారి దగ్గర ఉన్న జిరాక్స్ పత్రాలను పరిశీలించిన పోలీసులు లబ్ధిదారుల్లో ఎవరి పేరు ఉందో వారిని మాత్రమే కలెక్టరేట్లోకి అనుమతిచ్చారు. జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేయనున్నారు.