24-10-2025 11:32:11 AM
శామిర్ పేట్: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రేపింది. పసుపు, కుంకుమ,జీడీ గింజలు, నిమ్మకాయ,చేప, మంత్ర తంత్రాలతో చేసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత రాత్రి ఊరిలోని మినీ ఫంక్షన్ హాల్ లో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఫంక్షన్ హాల్ అడవి ప్రాంతంలో ఉండటంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని , గతంలో కూడా తాగుబోతులకు ఫంక్షన్ హాల్ అడ్డాగా మారిందని . ఇటువంటివి పునరావృతం కాకుండా మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు కఠిన చర్య తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.