calender_icon.png 24 October, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు?

24-10-2025 11:29:38 AM

 రాజాపూర్  కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షులు ప్రకటన జారీ 

సమాచారం లేదన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్(విజయక్రాంతి): నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తనకు మరెవ్వరు సాటి లేరు అనే విధంగా ప్రకటనలు బలం చేకూర్చుతూ  అలజడి సృష్టిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy brother) సొంత సోదరుడు దుష్యంత్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తుంది. రాజపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య పై ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, క్రమశిక్షణ రైతంగా ఆరోపణలు చేసినందుకుగాను ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి పై పార్టీ మంచి సస్పెండ్ చేసినట్లు రాజాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో దుష్యంత్ రెడ్డి పై భూ వ్యవహారాలు పలు సెటిల్మెంట్లకు సంబంధించి కలగజేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల నవాబ్ పేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కోఆర్డినేటర్ ధార భాస్కర్ సైతం ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జనంపల్లి దుష్యంత్ రెడ్డి వ్యవహారంపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ అంశాన్ని రాష్ట్ర పిసిసి దృష్టి కూడా తీసుకుపోతానని ఆయన ప్రకటించిన విషయం అందరికీ వివిధమే. ఈ తరుణంలోనే రాజపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విడుదల చేసిన పట్టణ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

ఈ విషయంపై రాజపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య వివరణ కోరగా  దుష్యంత్ రెడ్డి సస్పెన్షన్ చేస్తూ జారీ చేసిన పట్టణ వాస్తవ కాదా అని సంప్రదించగా వాస్తవమేనని పార్టీ నియమ నిబంధనలకు లోబడి సస్పెన్షన్ చేస్తూ ప్రకటన జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై పార్టీ పెద్దలకు పూర్తిస్థాయిలో వివరణ చేస్తానని ప్రకటించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని ఆ విషయాన్ని తెలుసుకుంటానని విజయ క్రాంతి దినపత్రిక ప్రతినిధికి తెలియజేశారు.