calender_icon.png 24 October, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి

24-10-2025 11:52:29 AM

మంథనిలో పోలీస్ అమరవీరుల వారోత్సవంలో పెద్దపల్లి డిసిపి కర్ణాకర్

మంథని,(విజయక్రాంతి):  రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండని మంథనిలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పెద్దపల్లి డిసిపి కర్ణాకర్(Peddapalli DCP Karnakar) పిలుపునిచ్చారు.   పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేల మేరకు మంథని పోలీసుల ఆధ్వర్యంలో మంథని లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంథని, గోదావరిఖని టూ టౌన్ సర్కిల్ పరిధిలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి మంథని పోలీస్ స్టేషన్ లో మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏసిపి రమేష్ తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంతినిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద మొత్తంలో పాల్గొని రక్త దానం చేసిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.  రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడినవారమవుతామని, యువత మంచి మార్గంలో నడిచి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్, యువత 150 మంది రక్తదానం చేశారు. ఈ శిబిరంలో టూ టౌన్ సిఐలు ప్రసాదరావు, లింగమూర్తి, మంథని ఎస్ఐలు రమేష్, సాగర్, ముత్తారం ఎస్సై రవికుమార్, రామగిరి ఎస్సై దివ్య, కమాన్పూర్ ఎస్సై ప్రసాద్ లు, పెద్దపల్లి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ కావేటి రాజగోపాల్, మంథని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేడగొని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.