24-10-2025 12:43:23 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన మొత్తం 13 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్(Jogulamba Gadwal Collector) బీఎం సంతోష్ తెలిపారు. గద్వాల్ జిల్లా కలెక్టర్ ఎస్పీ బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. గాయపడిన ఏడుగురు వ్యక్తులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురు హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురు ప్రయాణికుల స్థితి, వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదని కలెక్టర్ తెలిపారు.
హెల్ప్‌లైన్ నంబర్లు: 9912919545, 9440854433.