calender_icon.png 24 October, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సుప్రమాదం.. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

24-10-2025 01:08:07 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు(Telangana residents) రాష్ట్ర ప్రభుత్వం తరుపున 5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Telangana Transport Minister Ponnam Prabhakar) వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ఎక్స్ లో పేర్కొన్నారు.

శుక్రవారం తెల్లవారుజామున కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదానికి గురైన బస్సులో తెలంగాణకు చెందిన 13 మంది ప్రయాణికులు ఉన్నారని గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు.  గాయపడిన ఏడుగురు వ్యక్తులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురు హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురు ప్రయాణికుల స్థితి, వారు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదపి కలెక్టర్ పేర్కొన్నారు.

అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లు 

ఎం. శ్రీరామ చంద్ర, సహాయ కార్యదర్శి – 9912919545

ఇ. చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్ – 9440854433