calender_icon.png 24 October, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సును ఢీకొన్న వాహనదారుడు మృతి.. కుటుంబంలో విషాదం

24-10-2025 11:46:50 AM

కర్నూలు: కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో(Kurnool bus accident) బస్సును ఢీకొన్న పల్సర్ వాహనదారుడు శివ శంకర్(20) మృతి చెందాడు. శివశంకర్ కర్నూలులోని ప్రజానగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బైక్ ఢీకొన్న తర్వాత బస్సు బైకును 300 మీటర్లు లాక్కెళ్లింది. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో శివ మృతిపై కుటుంబంలో విషాదం నెలకొంది. అర్ధరాత్రి బయటకు ఎందుకెళ్లాడో తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం కాగా, 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడిన 21 మందిని ఆస్పత్రికి తరలించారు.