calender_icon.png 9 May, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పరిరక్షణ ఐఎన్టీయూసీకే సాధ్యం

18-03-2025 01:46:25 AM

సంఘం జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్

మందమర్రి, మార్చి 17 : సింగరేణి సంస్థ సంరక్షణ ఐ ఎన్ టి యు సి తోనే సాధ్యమని ఐఎన్టియుసి జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సింగరేణి ని పరిరక్షించే సత్తా ఐఎన్టియుసి యూనియన్ కే ఉండని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిని ముంచడమే బిఆర్‌ఎస్, టీబీజీకేఎస్ లక్ష్యమని విమర్శించారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటియుసి పూర్తిగా విఫలమైందనీ, కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమై విశ్వాసాన్ని కోల్పోయిందనీ ఆరోపించారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కళను నెరవేర్చడంతో పాటు పెరక్స్ పై ఆదాయం పన్ను మాఫీ చేపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, రాంశెట్టి నరేందర్, పానుగంటి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.