20 July, 2026 | 8:40 PM

యువ సంగ్రామంలో పింక్ పెయిడ్ అర్టిస్టులే

20-07-2026 01:39 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నిర్వహించింది యువ సంగ్రామం కాదని, యువతను రెచ్చగొట్టే సదస్సు అని ప్రభు త్వం విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించా రు. ఫింక్ పెయిడ్ అర్టిస్టులతో యువ సంగ్రామ సదస్సును నింపేశారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి అనేక మంది బలిదానాలకు కారణమయ్యారని మండిడపడ్డారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఎండ్రిన్ మందు తాగి చావాలంటూ కేటీఆర్ మాట్లాడిన తీరును చూస్తుంటే.. ఆయన మనస్తత్వం ఏమిటో అర్థం అవుతుందన్నారు.

మళ్లీ అధికారంలోకి రావా లన్న ఆలోచనతో విష సంస్కృతిని, విష బీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నారని ఆది విమర్శించారు. పెట్రోలు పోసుకొని అగ్గిపెట్టే దొరకని వాళ్లు యువతను మళ్లీ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, పేపర్ లీక్‌లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి నియా మక పత్రాలను అందజేశామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.