calender_icon.png 28 May, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెగబడితే ఆపరేషన్ రుధిర్!

08-05-2025 12:00:00 AM

బుధవారం సూర్యుడు తన సిందూర వర్ణంతో నిండిన తూర్పురేఖలతో ప్రజలకు దర్శనం ఇవ్వకముందే భారత వాయుసేన ‘ఆపరేషన్ సిందూర్’ నామధేయంతో ఏకాదశి శుభముహూర్త ఘడియల్లో తెల్లవారుఝాము 1 గంట తరువాత పాకిస్థాన్ ప్రభుత్వంలో ని అడ్డగోలు టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేసింది. గత మూడు దశాబ్దాలుగా టెర్రరిస్తులను మహారాజ పోషకులుగా,  భారత్‌పై ఉగ్రదాడులకి ప్రోత్సహించి కల్లోలం, మారణకాండలు చేసేందుకు పెంచి పోషిస్తున్న ఉగ్ర శిబిరాలపై దాడు లు చేసి ధ్వంసం చెయ్యటంతో పాకిస్థాన్ వణికిపోయింది.

పైగా ఈ దాడిలో ప్రపంచంలో పలు దేశాల్లో మోస్ట్ వాంటెడ్ టెర్ర రిస్ట్‌గా వున్న మసూద్ అజహర్ కుటుంబసభ్యులు పదిమంది, అతని ముఖ్య అనుచ రులు నలుగురితోసహా మొతం 100కి పైగానే ఉగ్రవాదులు మరణించినట్లు తెలియవచ్చింది. అయితే, మసూర్ మాత్రం బతికాడా, చచ్చాడా అనే విషయం కడపటి వరకు ధ్రువ పడలేదు. కాని కరడు కట్టిన వారు ఎంత నీచులైనా సనాతన భారత్ మాత్రం వారికి దశమి గడియల్లో మరణించే వీలు కల్పించిందనే చెప్పాలి.

పౌరుల ప్రాణాలకు భరోసా

ఇలా ఉండగా పహల్గాంలో ముష్కరు లు తెగబడి ఒక నేపాల్ జాతీయుడితోసహా 26 మంది వినోదం కోసం వెళ్లిన ప ర్యాటకులను అమాయకంగా హతమార్చారు. పాక్ పెంపుడు వరాహ రాక్షస మూకల తూటాలకు బలైన 26 మంది కుటుంబసభ్యులకు, ఈ ఆరాచకాన్ని జీర్ణించుకోలేక మండిపోతున్న హృదయాలతో వున్న యావత్ జాతికి కొంతలో కొంత లేపనం పూసినట్లయింది.

బాధపడే హృదయాలకు సాంత్వన త ప్పదని భావించిన ప్రధాని నరేంద్ర మోదీ నేత్రుత్వంలోని కేంద్ర రక్షణ బలగాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులపై చర్యను చేపట్టాయి. ఆయా ప్రాంతాలలోని పౌరులకు ప్రాణనష్టం జరుగకుండా కేవ లం ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా అత్యంత ఆధునిక ఆయుధాలతో గురితప్పని రీతిలో వ్యవహరించారు.

ఖచ్చితత్వంతో కూడిన ఈ ఆపరేషన్‌లో 26/11 దాడులకు పాల్పడిన కసాయి అజమాల్ కసబ్ లాంటి కరడుకట్టిన, శిక్షణ పొందిన శిబిరంలోని వారితోసహా 9 ఉగ్రశిబిరాలు మెరుపు దాడిలో ధ్వంసం అయ్యాయి. గాయపడిన హృదయాలతో వున్న భారత ప్రజలకు కొంత మనసు భారం తీరిందని చెప్పాలి.

అమాయకులు బలయ్యారు

అంతవరకూ అడపాదడపా జరిగిన ఉగ్రవాదుల దొంగ దాడుల్లో అమాయకు లు, రక్షణ దళాలు అసువులు కోల్పోతు న్నా మరీ ముష్కరులు తెగించి శ్రుతి మించి పార్లమెంట్‌పై జరిపిన దాడి నుంచి కశ్మీర్‌లోని పహల్గాం దాడి వరకు 350 మంది పౌరులు మృతి చెందగా, 600 మంది గాయపడ్డారు. అలాగే, ఇదే కాలం లో సైనికులు, రక్షణ దళాలకు చెందిన 600 మంది అమరులవగా, 1400 మం ది గాయ పడ్డారని సైనిక వర్గాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అంతం లేకుండా పోయిన ఈ అకృత్యాలను అదుపు చేసేందుకు చర్యలు తీసు కోవాలని కేంద్రం 2023లోనే ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి ఫిర్యాదు చేసింది. అయినా, ఇంతవరకు ఏ విధమైన చర్యలు లేవు. ఐరాస కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదే తప్ప ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ఆరాచకాలను నిలువరించలేకపోతోందనే ఆరోపణలను ఇప్పటి సంఘ టనలు రుజువు చేస్తున్నాయని చెప్పక తప్పదు.

అసలు ఐక్యరాజ్యసమితి ప్రధాన ఆశయాలలో ముఖ్యంగా ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం వంటివి ఉన్నాయి.

ఇంకా, అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసే బృహత్ లక్ష్యంతోనే ప్రపంచ దేశాలు ఈ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

ఐరాస క్రియాశీలతా లోపం

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ కేంద్రంగా ఐరాసను నెలకొల్పారు. అప్పటి వరకు మనుగడలో ఉన్న ‘లీగ్ అఫ్ నేషన్స్’ (నానాజాతిసమితి) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. దీంతో దీనికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపితమైంది. ప్రస్తుతం 193 దేశాలు ఐరాసలో సభ్యదేశాలుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటువంటి సంక్లిష్ట సమయాలలో ఈ సంస్థ తీరు ప్రేక్షక పాత్ర వహిస్తుండడం దురదృష్టకరం.

ఒక్క యుద్ధం గాని, మన దేశంపై పాకిస్థాన్ పెంచుతున్న ముష్కరుల దుర్మార్గపు దాడులను నివారించటంలోగాని ఐరాస క్రియాశీలంగా వ్యవహరించలేక, ప్రేక్షక పాత్రగానే ఉండిపోతోంది. ఎట్టకేలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తానున్నానంటూ ఒక ప్రకటన చేశారు.

ఉగ్రదాడి ఘటన అనంతరం ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని, అయితే ఇలాంటి సందర్భాల్లో సైనిక చర్యే పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఇంతవరకు నోరు మెదపని అయన గొప్పగా సెలవిచ్చారు. కనుక చెవిటివాడికి చెప్పినా, శంఖం ఊదినా లాభం లేనట్లు చివరికి కేంద్రమే మనకు వున్న హక్కును కాపాడుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల యావత్ భారతదేశ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు సంపూర్ణ కచ్చితమైన సమాచారం కలిగి వున్న కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని ‘ఆపరేషన్ సిందూర్ -2’కి సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తున్నది. పక్కన నుంచి మరి ఏ ఇతర కవ్వింపు చర్యలు వచ్చినా వాటిని కూడా ధ్వంసం చెయ్యక తప్పనిసరి అవుతున్నది. దీనికి బాధ్యత ఆ దేశానిదే అవుతుంది. 

ఇప్పటికే సెలవుల్లో వున్న అందరూ వాటిని రద్దు చేసుకుని వెంటనే విధుల్లో చేరాలని తాజాగా ఆయా రక్షణ దళాలశాఖ అధికారులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. ప్రభు త్వం తీసుకునే చర్యలపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ‘సిందూర్ నాటికి కూడా పిచ్చి చేష్టలు మానకపోతే ఇక భారత్‌కి ఒకే ఒక్క మార్గం, అదే ఆపరేషన్ రుధిర్. లేదా ఎలిమినేషన్ పాకిస్థాన్. ఇక తేల్చుకోవాల్సింది ఆ ఉగ్రదేశమే!

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ సెల్: 949145699