17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఖైదీల బెయిల్ విషయంలో వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి

31-10-2025 08:57 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్: ఆర్థిక స్థోమత లేని కారణంగా హామీ పత్రం డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీల బెయిల్ విషయంలో వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు సైతం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లా స్థాయి సాధికార కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తన క్యాంపు కార్యాలయంలో హాజరయ్యారు. మిగిలిన కమిటి సభ్యులలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజనీ, మహబూబ్ నగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ రవి కుమార్ తమ తమ కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ఈ రోజు విచారణలో  నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలకు బెయిలు లభించినప్పటికి ఆర్థిక స్తోమత లేని కారణంగా  హామీ పత్రం ఇవ్వలేని (7) మంది  ఖైదీలపై జిల్లా స్థాయి కమిటిలో  చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు స్యూరిటీ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని రిమార్కులో నమోదు చేస్తున్నారని, అలాంటి వారి కుటుంబ సభ్యులను సైతం కమిటి ముందుకు పిలిచి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని జైలర్ కు సూచించారు.  సాధికార కమిటికమిటి ద్వారా  ఎవరికైతే హామీ పత్రం డబ్బులు మాఫీ చేసి జైలు నుండి విడుదలకు అనుమతించడం జరుగుతుందో అలాంటి వారిని విడుదలకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.