calender_icon.png 1 November, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

31-10-2025 08:53:17 PM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేస్తోందని  ఆయన అన్నారు.

పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేస్తోందని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రతి కుటుంబంలో సంతోషాలు నింపుతున్నాయని పేర్కొన్నారు.గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.  బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్లు లేని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే తమ లక్ష్యమని వివరించారు. అనంతరం బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఎల్లమ్మ కాలనీ డబుల్ బెడ్​రూం ఇళ్లు, ఎస్సీ కాలనీలో రూ.70 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.