31-10-2025 09:01:10 PM
 
							ఆదిలాబాద్,(విజయక్రాంతి): పాఠశాలలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి చెకుముకి సైన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు దండ నాయక ఉమాకాంత్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఉట్నూర్ ITDA కార్యాలయంలో జిల్లా విద్యాధికారి, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త చేతుల మీదుగా గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ చెకుముకి సైన్సు సంబరాలు పాఠశాల స్థాయిలో నవంబర్ 7న, మండల స్థాయిలో నవంబర్ 21న, జిల్లాస్థాయిలో నవంబర్ 28న పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలలో జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు.
ఈసారి రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు కరీంనగర్ పట్టణంలో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని పాఠశాలలలో ఈ పరీక్షను రాయించి విజయవంతం చేయ వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్ఓ జగన్, రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటపర్తి ఉషన్న జిల్లా నాయకులు ఉల్లెంగుల గంగన్న, జాదవ్ జవేందర్, వేముల నాగరాజు పాల్గొన్నారు.