calender_icon.png 13 July, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన అగ్రిటెక్ సేవలు భేష్

13-07-2025 12:33:31 AM

ఎనమాముల మార్కెట్‌లో సంస్థను సందర్శించిన వ్యవసాయ అధికారులు

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): వరంగల్ ఎనమాముల మార్కెట్‌లో ఆధుని క వ్యవసాయ పరికరాలతో నెలకొల్పబడిన మన అగ్రిటెక్ సంస్థను శనివారం వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ, ఇత ర అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మన అగ్రిటెక్‌లో ఏర్పాటు చేసి న ఒక్కో స్టాల్స్‌ను పరిశీలించారు. సంస్థ అధినేత పాషికంటి రమేష్ స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ పరికరాలను, వాటి పనితీరును క్లుప్తంగా వారికి వివరించారు.

ఆధునిక వ్యవసాయంలో రైతులకు మన అగ్రిటెక్ ద్వారా గత 8 సంవత్సరాలు గా అందిస్తున్న సేవలను ఛాయాచిత్రాల ద్వారా వివరించారు. రైతుల కోసం మన అగ్రిటెక్ ద్వారా ఎన్నో అవగాహన సదస్సు లు ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయం పట్ల వారికి పూర్తి అవగాహన కల్పిస్తూ వారికి కావాల్సిన పరికరాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా దళారులు దరిచేరకుం డా నేరుగా రైతులకు అందించాలానే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 

తాము అందిస్తున్న ఆధునిక వ్యవసాయ పరికరాలకు రైతులకు కావాల్సిన సబ్సిడీ కల్పించి తోడ్పాటునందిచాలని మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి సానుకూలంగా స్పందించారు.