13-07-2025 03:33:12 PM
హైదరాబాద్: కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ లోని తన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. గత కొంతకాలంగా దీర్ఘకాలి అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ నాయకులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో 750కి పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఇవాళ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపిన విషయం తెలిసిందే.