13-07-2025 12:35:01 AM
తనవంతు పాత్ర పోషిస్తున్న యూనియన్ బ్యాంక్ సైఫాబాద్ కార్యాలయం
హైదరాబాద్, జూలై 12: ఆర్థిక చేరిక అనేది సమ్మిళిత వృద్ధికి పునాది వేయడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన వారిని బలోపేతం చేస్తుంది. కావున యూనియన్ బ్యాంక్ ఆర్థిక సేవల విభాగం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ (జీపీ), అర్బన్ లోకల్ బాడీ (యూఎల్‌బీ) స్థాయిలో ఆర్థిక చేరిక (ఎఫ్‌ఐ) పథకాలను ప్రారంభించింది. 2025 జూలై 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు కొనసాగనుంది.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజ న (పీఎంజేడీవై) కింద ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు లేని వయోజనులకు పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలను తెరవడం, పీఎంజేజేవై, పీఎంఎ స్‌బీవై, ఏపీవై కింద నమోదు చేసేకునే వారి సంఖ్యను పెంచడం, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా జూలై 11న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ కార్యాలయం రంగారెడ్డి జిల్లాలోని ముంచింతల గ్రామపంచాయతీలో మెగా జన సురక్ష సాచురేషన్ అండ్ అవేర్నెస్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించింది.
కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేశ్ రంజన్ ప్రారంభించగా.. సీజీఎం (ఎఫ్‌ఐ) సుధాకర్ రావు, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ డిప్యూటీ జోనల్ హెడ్ సర్వేష్ రంజన్, సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ప్రాంతీయ అధిపతి సోనాలికా, లేపాక్షి జగదీశ్, బ్రహ్మయ్య, డిప్యూటీ ఆర్‌హెచ్‌లు హాజరయ్యారు. మొత్తం 15 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ.50 కోట్ల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.