20-08-2025 01:49:51 AM
చైతన్య హబ్ జూనియర్ కళాశాల చైర్మన్ వీవీ హనుమంతరావు
ముషీరాబాద్, ఆగస్టు 19(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ కళాశాల లక్ష్యమని చైతన్య హబ్ జూనియర్ కళాశాల చైర్మన్ వి.వి. హనుమంత రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాంకోఠిలోని జైన్ భవన్ లో చైతన్య హబ్ జూనియర్ కళాశాల ’ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్’ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు సంస్కృతిక ప్రదర్శన లు, నృత్యాలతో అందరిని అలరించారు.
వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. అనంతరం చైర్మన్ హనుమంత రావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు విద్యనందించే తమ విధానం ఆధునికమైందని, విద్యార్థుల విజయానికి కీలకమైన జీవిత, విద్యా నైపుణ్యాలతో పాటు వారిని పూర్తి గొప్ప వ్యక్తులుగా త యారు చేయడమే తమ కళాశాల లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
హిమాయత్ నగర్ కేంద్రంగా ఉన్న చైతన్య హబ్ జూనియర్ కళాశాల ఏసీ క్యాంపస్‌లో దాదాపు 26 ఏండ్లకు పైగా అపార అనుభవం ఉన్న అధ్యాపకులచే చక్కటి వ్యవస్థీకృత బోధన పద్ధతితో కూడిన అంకిత భావం కలిగిన బృందం ఉందన్నారు. తమ కళాశాలలు నాణ్యమైన విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నాయన్నారు. తమ కళాశాలలో ఎంపీసీ, ఐఐటీ, బీపీసీ, నీట్, ఎంఈసీ, సీఈసీ, సీఏ, ఐపీఎంఏటీ తదితర కోర్సులు అందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా తమ విద్యా సంస్థ పని చేస్తుందని, ప్రతి ఏడాదిలో ఎందరో తమ కళాశాల విద్యార్థులు బహుళ జాతి సంస్థలకు ఎంపికవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ కె. శంకర్, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.