20-08-2025 01:50:01 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి)ః ఢిల్లీ, ముంబై, చెన్ను, హైదరాబాద్, బెం గళూరుసహా ఎనిమిది నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మహిళల భద్రత కోసం పలు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో మహి ళా భద్రతా విభాగం అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ ఈ ప్రాజెక్టు కింద ఆయా రాష్ట్రాల్లో 33 వేల సీసీటీవీల ఏర్పాటుతోపాటు పింక్ టాయిలెట్లు, మహిళా పెట్రోల్ యూనిట్లు, కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం నిర్భ య నిధి కింద రూ.2,840 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చ్ నాటికి ఆయా సౌకర్యాలన్నింటినీ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
క్రిమినల్ న్యాయవ్యవస్థలోని అన్ని ప్రధాన విభాగాలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చి సమగ్ర స మాచార మార్పిడి జరగడానికి రూపొందించిన సమగ్ర వ్యవస్థ ఐసీజేఎస్ 2.0, ఎన్‌ఎఫ్ ఐఈఎస్, జైళ్ల ఆధునికీకరణ, సేఫ్ సిటీ ప్రాజెక్టులు, అంబ్రెల్లా స్కీమ్, మహిళా సహాయక డెస్క్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ వ్యవస్థల పనీతీరు, ఇబ్బందులు, సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు.