16-12-2024 01:46:43 AM
* ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు
* పాతరాజంపేటలో దళితుల ఆందోళన
కామారెడ్డి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేట గ్రామ శివారులో గల 5 ఎకరాల భూమిని పోలీసు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది కబ్జా చేశారని ఆదివారం బాధిత దళితులు ఆందోళన చేపట్టారు. పాతరాజంపేటలోని 15 మందికి చెందిన భూమిని పోలీసు ఉద్యోగులు గణపురం ఎల్లయ్య, రాజకుమార్, ప్రవీణ్‌కుమార్, ఎక్సైజ్ ఉద్యోగి గణపురం రాజశేఖర్ కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. తమ భూమిలో జేసీబీ, ట్రాక్టర్ పెట్టి చదను చేసే సమయంలో అడ్డుపడితే చంపివేస్తామని బెదిరిస్తున్నారన్నారు. కామారెడ్డి ఎమ్మార్వోకు, కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎస్పీ సింధుశర్మ, కలెక్టర్ స్పందించి తమ భూమిని తమకు అందజేయాలని వేడుకున్నారు.