calender_icon.png 12 September, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టుడు లేదు.. కూల్చుడే

16-12-2024 01:44:28 AM

  • ఏడాదిలో రాష్ట్రంలో ఒక్క ఇంటినైనా కట్టారా?
  • హైడ్రా పేరిటపేదల ఇండ్లను కూల్చారు
  • మాజీ మంత్రి హరీశ్‌రావు

  • పటాన్‌చెరు, డిసెంబర్ 15: ప్రభుత్వం వచ్చి ఏడాదైనా రాష్ట్రంలో ఒక్క ఇంటిని కట్ట ని రేవంత్ సర్కార్.. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చిందని మాజీమంత్రి,   హరీశ్‌రావు ఫైరయ్యారు. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో బీఆర్‌ఎస్ యువనేత మానిక్‌యాదవ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న అమీన్‌పూర్ స్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి. సాయంత్రం ఐలాపూర్‌లో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవానికి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

  • ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్‌పూర్‌లో తీవ్రంగా ఉన్న నీటి సమస్యను మిషన్ భగీరథతో కేసీఆర్ ఇంటింటికి నీళ్లిచ్చి సమస్యను తీర్చారన్నారు. ‘బీరంగూడ నుంచి ఓఆర్‌ఆర్ వరకు రూ.55 కోట్లతో డబుల్ రోడ్డు వేయించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐలాపూర్‌లో ఒక్క లైటుబుగ్గ కూడా పెట్టలే దు’ అని అన్నారు. సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌ను నిల దీస్తామ న్నారు.

  • అనంతరం కేసీఆర్ కప్ క్రికె ట్ టోర్నీలో విన్నర్‌గా నిలిచిన సత్య లెవన్ జట్టుకు రూ.70 వేల నగదు, ట్రోఫీ, రన్నరప్‌గా నిలిచిన ఐలాపూర్ వారియర్స్ జట్టుకు రూ.30 వేల నగదు, ట్రోఫీని  అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్, కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సోమిరెడ్డి, అంజయ్యయాదవ్  పాల్గొన్నారు.