02-07-2025 12:34:20 AM
కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశంలోని ప్రముఖ వైద్య సేవల సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిస్వార్థంగా శ్రమిస్తున్న వైద్యుల సేవలను గుర్తిస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్ మాట్లాడుతూ.. “ప్రతి రోగి కోలుకోవడం వెనుక ఒక డాక్టరు ఉన్నాడు.
చికిత్స మాత్ర మే కాదు, వారి అంకితభావం, ధైర్యం, శ్రమ మనందరికీ ఆదర్శం. డాక్టర్ల బలంతోనే ఆరోగ్య రంగం ముందుకు సాగుతోంది. వారి సేవల వల్లే కేర్ నేడు దేశంలో విశ్వసనీయ ఆసుపత్రుల శ్రేణిలో నిలిచింది. 1997లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో 7 నగరాల్లో 17 ఆసుపత్రులతో పనిచే స్తోంది. గుండె, క్యాన్సర్, ఐసీయూ, ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ప్రధాన విభాగాల్లో ప్రత్యేకత కలిగి ఉంది.
భారత్లో మొట్టమొదటి స్వదేశీ కోరోనరీ స్టెంట్ అభివృద్ధి, స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, గర్భాశయ మార్పిడి వంటి పది బ్రేకింగ్ శస్త్రచికిత్సలు ఈ హాస్పిటల్ క్రెడిట్‌లో ఉన్నాయి. గత 27 ఏళ్లుగా మా డాక్టర్లు నైపుణ్యం, సహృదయంతో వేలాది మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులు అందించడమే మా కర్తవ్యం. రోగి భద్రత, నాణ్యమైన వైద్యం మా లక్ష్యం” అని డా. మాథుర్ తెలిపారు.