12-11-2025 12:03:36 AM
పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయడంతోనే ఇప్పుడు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ వైపు సూ చిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు కాంగ్రెస్‌ను గెలిపిస్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పని చేసిన ప్రతి కార్యకర్త, నాయకులకు పేరుపేరునా ధన్యవా దాలు తెలిపారు.
గత నెల రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, నాయకులు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి మైనస్‌లో ఉన్న కాంగ్రెస్.. పోలింగ్ నాటికి మెజార్టీ వైపు అడుగులు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ల సలహా లు, సూచనలతో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమలు చేశారు.
ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించి.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులను ప్రచార కార్యక్రమాలలో నిమగ్నం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు షోలు, మంత్రులు, నాయకుల ఇంటింటి ప్రచారాలు, ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ కాంగ్రెస్ ముందుకు సాగిందని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు.