calender_icon.png 12 November, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి

12-11-2025 12:04:24 AM

ఆచార్య కూరపాటి వెంకట్ నారాయణ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కన్వీనర్

కాకతీయ యూనివర్సిటీ నవంబర్ 11 (విజయక్రాంతి): కే యు ఎస్డి ఎల్సీ మహాత్మ జ్యోతిరావు పూలే ప్రాంగణంలో బీసీల ధర్మ పోరాట దీక్ష రెండో రోజు బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి గంటి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్షను ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ అతిథులు  పూలే ఆశయ సాధన సమితి  వ్యవస్థాపకులు డాక్టర్ సంగని మల్లేశ్వర్,

కేయూ ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్ దీక్షను ప్రారంభించి తదనంతరం ముఖ్య అతిది వెంకట నారాయణ ,మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు 78 సంవత్సరాలుగా రిజర్వేషన్లు అందక బీసీల వాటా ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు బడ్జెట్ లేకపోవటం మూలంగా అటు విద్యకి ఇటు ఉపాధికి అటు రాజకీయ రంగం వైపు ముందుకు సాగకుండా అగ్రవర్ణ నాయకులు.

78 సంవత్సరాలుగా అడ్డుపడుకుంటూనే వచ్చారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు ఇంత మటుకు కూడా దాన్ని ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు మరి పార్లమెంటుకు పంపించినప్పటికి కూడా రాష్ట్రపతి గారు ఆమోదించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉండాలంటే బీసీల పైన కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి మండిపడ్డారు.

వెంటనే బిజెపి పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకొని బీసీలపైన ప్రేమను కనపరిచి బీసీ  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి డిమాండ్ చేశారు బీసీలకు మేం ఎంతో మాకు అంత రిజర్వేషన్లు కల్పించాలన్నారు కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ తరహాలో మరి ఈ వేప చెట్టు  క్రింద ఒక భోగి వృక్షం దగ్గర ఇక్కడ చేసిన ఉద్యమం ఏ ఉద్యమం కూడా   చివరికి ఫలితాన్ని ఇచ్చినటువంటి  ఇక్కడ జరిగిన ఉద్యమం ఏది కూడా నీరుకారలేదని ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీలలో ఉధృతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిపించేలాగా.

ఈ ఉద్యమం ముందుకు సాగుతుందని అన్నారు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ధర్మ పోరాట దీక్ష ధర్మబద్ధమైనటువంటివి ఈ ధర్మ పోరాటానికి మరి అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకతీతంగా బీసీ నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆకుతోట శ్రీనివాస్ , చీకటి శీను, వేణు , మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు  మంద వీరస్వామి బీసీ ఐక్య  సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎదునూరి రాజమౌళి బీచి విద్యార్థి జేఏసీ నాయకులు నాగరాజు పటేల్, కాయిత నాగరాజు, బోస్కో నాగరాజు, సూర్య కిరణ్,అజయ్ సింగ్, అన్వేష్, రాజశేఖర్, గణేష్, నవీన్, సురేందర్, అనిల్, రవితేజ, ధర్మ, తదితరులు పాల్గొన్నారు