calender_icon.png 13 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలి

13-11-2025 12:09:14 AM

జోనల్  స్థాయి గిరిజన క్రీడలను ప్రారంభించిన ఎంపీ నగేష్, ఎమ్మెల్యే  బొజ్జు పటేల్

ఆదిలాబాద్, నవంబర్12 (విజయక్రాం తి): ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన జోనల్  స్థాయి గిరిజన క్రీడ ఉత్సవాల సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రీడల ప్రారంభోత్సవ వేడుకకు ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్‌లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలకు ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఉట్నూర్ డివిజన్ ల నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాల బాలబాలికలకు హాజరయ్యారు.

పోటీల ప్రారంభోత్సవానికి ముందుగా బిర్సముండ జయం తి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళు లు అర్పించారు. అనంతరం అతిధులు జ్యోతి ప్రజ్వలన గావించి ఆటలను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవాలని కోరారు. విద్యార్ధులు క్రమశిక్షణతో మెలిగి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిడి జాదవ్ అంబాజీ, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఐటీడీఏ ఈ ఈ జాదవ్ తనాజీ, 4 డివిజన్ ల నుంచి వచ్చిన విద్యార్థులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.