calender_icon.png 17 July, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

15-07-2025 12:54:58 AM

- బీసీలపై బీజేపీ బీఆర్‌ఎస్‌లకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు?

- బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ఆమోదానికి కల్పన

- బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి

- జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కృతఙ్ఞత ర్యాలీ

- రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: జూలై 14 (విజయక్రాంతి); మాది మాటల ప్రభుత్వం కాదు చే తల ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమో దించడం ఒక చరిత్ర నిర్ణయమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అ న్నారు.సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.సిరిసిల్ల పట్టం లోని నేతన్న విగ్రహం నుండి అంబేద్కర్  గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తో పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నా రు. వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంఎల్లవేళలాఉంటుందని,బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఆమోదం తెలిపినందు కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయా త్ర భారత్ జోడో యాత్ర చేసి దేశ ప్రజల ఆ కాంక్షలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారని,తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని ఆయన ప్రకటించారని గుర్తు చేశారు. కుల గణనను దేశ సామాజిక పరిస్థితులకు ఎక్స్రేగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేశాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నాడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, విద్యా,ఆర్థిక, ఉద్యోగ రాజకీయ, కుల సర్వే ప్రక్రియ చేపట్టడం జరిగిందని వి వరించారు.బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణ యం.. మాది మాటల ప్రభుత్వం కాదు చేత ల ప్రభుత్వం దానికి నిదర్శనమే నేడు బీసీలకు రాజకీయ,విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కాకున్నా బీసీలకు అండగా ఉంటున్నారు..అసెంబ్లీ లో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ బిల్లు ప్రవేశ పెడితే దాన్ని నేను బలపరిచే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతం.

రానున్న ఎన్నికల్లో 42 శాతం బీసీ బిడ్డలు గెలవాలి.. ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారు..రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని బోడోయత్ర చేశారు.బీసీ కుల గణన చెసి రాష్టలో బీసీలు 56 శాతం ఉన్నట్లు లెక్కలు తీశారు.ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేంద్రప్రభుత్వం బీసీ కుల గణన ను 9 షెడ్యూల్లో చేర్చాలని ధర్నా నిర్వహించడం జరిగింది.. పదేళ్ల పాటు బీసీలను బీఆర్‌ఎస్ బిజెపి అన్ని విధాలా విస్మరించారు.

బీసీలపై బీజేపీ బీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.కుల గణ న సర్వేను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ ఈ సర్వేలో పా ల్గొనలేదు.రాజ్ నాథ్ సింగ్ కుల గణన చే యం అని కోర్టులో కేస్ వేశారు.కానీ రాహు ల్ గాంధీ దెబ్బకు దిగి వచ్చి కుల గణన చేస్త అని ప్రకించారు.బీజేపీ ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ చెసి 9 షె డ్యూలు చేర్చాలి.బీసీలు అందరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనికి అండగా ఉండాలి.వచ్చే ఎ న్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.