calender_icon.png 16 July, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన గణ మన పుస్తక ఆవిష్కరణ

15-07-2025 12:55:45 AM

కోదాడ జులై 14 : కోదాడలోని పెన్షనర్స్ భవనంలో సోమవారం కోదాడ రచయితల సంఘం,రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కోదాడ వాసి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు, కవి జూలూరు గౌరీ శంకర్ రాసిన దీర్ఘ కవిత ‘బహుజన గణ మన‘ పుస్తక ఆవిష్కరణ జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు, కవి, విమర్శకులు బెల్లంకొండ  ప్రసేన్  ఆవిష్కరించారు.

ఆయన మాట్లాడుతూబీసీల కవితాత్మక తాత్విక నినాదమే బహుజన గణ మన అని, అందరూ ఏకం కావాలనీ గౌరీ శంకర్ దీర్ఘ కవిత ద్వారా పిలుపు నిచ్చారన్నారు. కోదాడ రచయితల సంఘం అధ్యక్షులు పుప్పాల కృష్ణమూర్తి,  రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షులు రావెళ్ళ సీతారామయ్య, తెలుగు లెక్చరర్,కవి వేముల వెంకటేశ్వర్లు, సరికొండ నరసింహరాజు, పందిరి రఘు, వరప్రసాద్,గడ్డం నర్సయ్య, బి. ఆర్. కె.మూర్తి, వేముల కోటయ్య, ఏ. వీరబాబు, నరసయ్య, పొట్ట జగన్నాథం, బిక్షం, సిరంగి నరసింహారావు పాల్గొన్నారు.