07-08-2025 01:24:05 AM
రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బన్ బట్టర్ జామ్’. రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేశ్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తమిళ్‌లో ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా పేరుతెచ్చుకొని, సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 22న శ్రీవిఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీహెచ్ సతీశ్‌కుమార్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కాలేజ్ లైఫ్, ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారని.. ఇది యూత్ ఫుల్, లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రాఘవ్ మిర్‌దత్ వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించిన తీరు, నివాస్ కే ప్రసన్న సంగీతం, బాబుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి.