07-08-2025 01:22:42 AM
టాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ మంచు తన పాత్రలను, స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఇప్పుడాయన ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో అలరించనున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుల వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా.. 1897 నుంచి 1922 మధ్య నడిచే కథతో రూపొందుతోంది.
ఈ కథలో మనోజ్ ఎన్నడూచూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారని టీమ్ చెబుతోంది. కుల వ్యవస్థ ఒత్తిళ్ల నుంచి తిరగబడి, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఓ రెబల్ కథ ఇది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. ఇది ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తుంది. ఈ పోస్టర్‌కు జోడించిన ‘మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు!’ అనే ట్యాగ్‌లైన్ కట్టిపడేసింది.