calender_icon.png 15 November, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రెడిట్ ఔట్రీట్ ప్రచారానికి విశేష స్పందన

15-11-2025 12:17:07 AM

సెంట్రల్ బ్యాంక్, కడప రీజియన్ ఆధ్వర్యంలో వేమూరులో నిర్వహణ

కడప, నవంబర్ 14: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కడప రీజియన్ వేమూరు గ్రామం లో శుక్రవారం వ్యవసాయ క్రెడిట్ ఔట్రీచ్ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కడప రీజినల్ హెడ్ ఇ.వెంకటేశ్వరరావు అధ్య క్షత వహించగా ఎంపీడీఓ పి.రవికుమార్, ఎంఏఓ ప్రేమ్‌సాగర్, వేమూరు ఏపీఎం కె.శోభన్, ఆర్‌ఓ చీఫ్ మేనేజర్ బీకే ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ జ్ఞానసౌందరి, వేమూరు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.

క్రెడిట్ ఔట్రీచ్ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి ముఖ్యం గా స్వయం సహాయక సంఘ సభ్యుల నుంచి భారీ స్పందన లభించింది. స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరు లేఖలు, పీఎంజే జేబీవై క్లెయిమ్ సెటిల్‌మెంట్ చెక్కులను వార సులకు అందజేసారు. రూ.25 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలను పంపిణీ చేశారు. కడప రీజియన్ పరిధిలోని అన్ని శాఖలు కూడా ప్రచారం నిర్వహించాయి.