15-11-2025 01:28:32 AM
న్యూ ఢిల్లీ, నవంబర్ 14: అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నూతన కమిటీలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పట్టం కట్టారు. ఇదే రాష్ట్రానికి చెందిన రఘురాజ్ కిశోర్ తివారీని ఏబీవీపీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా వీరేంద్ర సింగ్ సోలంకిని ఎంపిక చేశారు. రఘురాజ్ కిశోర్ జబల్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కృషి విద్యాలయంలో ఆగ్రానమీలో పీహెచ్‌డీ చేసి ప్రస్త్తుం అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఆయన 1987 నుంచి ఏబీవీపీలో కొనసాగుతున్నారు. ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఎన్నికైన వీరేంద్ర సింగ్ సోలంకి ఇండోర్ శ్రీ అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ చదివారు. ప్రస్తుతం ఇదే నగరంలో వైద్యాధికా రిగా సేవలు అందిస్తున్నారు. ఆయన 2014 నుంచి ఏబీవీపీలో పనిచేస్తున్నారు.