07-10-2025 08:12:39 PM
ఎస్ఐ మునుగోటి రవిందర్..
నకిరేకల్ (విజయక్రాంతి): నిత్య వ్యాయామంతో పాటు ప్రాణాయామం, ధ్యానంతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవిందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాపు ఆన్ స్ట్రెస్ ఫ్రీ వర్కింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనులను ప్రణాళికబద్ధం చేయటంతో పని ఒత్తిడిని తగ్గుంచుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరికి సమయానికి ఆహారం, సరిపడా విశ్రాంతి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాయిని శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ఉపాధ్యాక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పి.రాములు, సభ్యులు మంగదుడ్ల శ్రీనివాస్, రాపోలు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి వెంకన్న, పోలీసు సిబ్బంది మునాస సత్యనారాయలు. అనూష, శ్రీరాములు, ఆక్సల్అలీ, రాంమోహన్, సుధాకర్ ఉన్నారు.