07-10-2025 08:53:37 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య..
రేగొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కి లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప కాయల నరసయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రేగొండ మండల పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గత కొన్ని రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ బాకీ కార్డు లంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసలు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు.
అసలు మాజీ ఎమ్మెల్యేకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని గుర్తు చేశారు. తనకు పదవులు ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే ప్రజల్ని మోసం చేసి తన ఆస్తులు కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది మీ కుటుంబం కాదా అని నిలదీశారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలను మీరు కానీ, మీ పార్టీ కానీ చేయడం మానుకొని ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు .ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు, కోటంచ జాతర చైర్మన్ ముల్కనూరి బిక్షపతి, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రవీందర్రావు, పోనుగంటి వీరబ్రహ్మం, మేకల బిక్షపతి, మటిక సంతోష్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.