calender_icon.png 7 October, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బాకీ కార్డు, కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలి

07-10-2025 09:20:34 PM

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి.

బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు 

ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ బాకి కార్డును కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరవెయ్యాలని పిలుపునిచ్చారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి,బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి పార్టీ నిర్ణయించనున్న జడ్పిటిసిలు,సర్పంచులు,ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించి, కెసిఆర్ కి జరిగిందని బహుమతిగా ఇవ్వాలని కోరడం జరిగింది...