calender_icon.png 7 October, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పిహెచ్సీలలో సాధారణ ప్రసవాలు పెంచాలి

07-10-2025 08:16:27 PM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

అడ్డాకుల: పిహెచ్సీలలో సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అడ్డాకుల మండలంలో పర్యటించి పి.హెచ్. సి, తహశీల్దార్ కార్యాలయంను తనిఖీ చేశారు. ఎం.పి.డి.ఓ కార్యాలయంలో జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పి.హెచ్.సిలో ప్రతి నెల మొదటి మంగళవారం ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి క్రమం తప్పకుండా సక్రమంగా పరీక్షలు నిర్వహించి, అనీమియా లోపం ఉన్న వారికి ప్రత్యేక చికిత్స అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ గురించి కలెక్టర్ సమీక్షించగా, సీజన్ లో ఒక డెంగ్యూ కేసు వచ్చిందని వైద్య సిబ్బంది వివరించారు. బి.పి, షుగర్, సికిల్ సెల్, క్యాన్సర్ తదితర వ్యాధులకు మందుల గురించి కలెక్టర్ అడుగగా మందులు స్టాక్ సరిపడా ఉందని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్ కు తెలిపారు. పి.హెచ్.సి.భవనం పరిశీలించారు. పి.హెచ్.సికి ఎక్కువగా ఎటువంటి కేసులు వస్తున్నాయి మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో లేబర్ రూమ్, ల్యాబ్ ను సందర్శించారు వార్డ్ లలో కలియ తిరిగి బెడ్ లపై  బెడ్ షీట్స్ లేకపోవడం గమనించి వెంటనే  వేయాలని సూచించారు. టాయిలెట్ ల నుండి దుర్వాసన రాకుండా పరిశుభ్రం గా ఉంచాలని సూచించారు..రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటు మెడికల్ ఆఫీసర్ డా.ఎం.హుస్సేన్,తదితరులు ఉన్నారు. అనంతరం ఎం.పి.డి.ఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి, ఎం.పి.డి. ఓ,తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కు పోలింగ్ కేంద్రాలు పరిశీలించి కనీస సౌకర్యాలు లేకుంటే వెంటనే కల్పించాలని అన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు.పెండింగ్ దరఖాస్తుల త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.కలెక్టర్ తో పాటు మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ, తహశీల్దార్ శేఖర్, ఎం.పి.డి. ఓ. సద్గుణ తదితరులు పాల్గొన్నారు.