calender_icon.png 7 October, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు..

07-10-2025 08:49:29 PM

నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం ఉన్నంత వరకు వాల్మీకి రచించిన రామాయణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు శ్యామలా దేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, అదనపు ఎస్పీ కాజల్ సింగ్, శిక్షణ కలెక్టర్ సలోని, బీసీ శాఖ అధికారి రాజలింగు తదితరులు పాల్గొన్నారు.