calender_icon.png 7 October, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మ పీఠంపై దాడి హేయమైన చర్య,..

07-10-2025 09:18:30 PM

మట్టి పెళ్లి సైదులు..

మోతే: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో  భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్‌ గవాయ్ పై ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం  హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లిసైదులు మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు. బరితెగించిన మతోన్మాది రాకేష్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేసి దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం కేసు విచారణ సమయంలో డయాస్‌ వద్దకు వెళ్లిన న్యాయవాది రాకేష్‌ కిషోర్‌ ఒక్కసారిగా తన స్పోర్ట్స్‌ షూ తీసి, సిజెఐపైకి విసిరే ప్రయత్నం చేయడం రాజ్యాంగ వ్యవస్థకు అవమానకరమన్నారు. భారత చరిత్రలో ఇది చీకటి రోజు అని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి పైన దాడి మాత్రమే  కాదు, రాజ్యాంగంపై జరిగిన దాడి అన్నారు. సమిష్టిగా భారత సమాజం గవాయ్ కుసంఘీభావంగా,అండగా నిలవాలని కోరారు. 

ఈ చర్య దురదృష్టకరమని, ఖండించదగినదని, ఈ ఘటనను న్యాయవ్యవస్థపై దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటన సాధారణంగా జరిగింది కాదని,స్వతంత్ర న్యాయవ్యవస్థపై జరిగిన బహిరంగ దాడిగానే పేర్కొన్నారు.దీనిని సహించలేమని, సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా న్యాయ సోదరభావం కలిగినవారు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు.  దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా ప్రధానమంత్రి,రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతినోరుమెదపకపోవడం రాజ్యాంగం పట్ల రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఏ పాటి గౌరవం ఉందో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.వందేండ్ల ఆర్ఎస్ఎస్ సంఘపరివారశక్తులు నేర్పుతున్నది ఇదేనా అన్నారు.వందేళ్ల ఆర్ఎస్ఎస్ కార్యచరణ వ్యవస్థ పై దాడి చేయడానికి సిద్ధమయిందా! అన్నారు.ధర్మ పీఠం పై దురాక్రమణ దాడి జాతి  విచ్చిన్నానికి నిదర్శనం అన్నారు.అంబేద్కర్ వ్రాసిన రాజ్యంగ ధర్మం కంటే ఈ భారత దేశంలో మరేధర్మం గొప్పది కాదన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన మేధావి  ఆ వ్యవస్థ మీద కూర్చోవడం బిజెపి జీర్ణించుకో లేకపోతుందన్నారు.