14-08-2025 08:24:13 PM
పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు(Edupayala Vanadurga Project) నిండు జలకళను సంతరించుకుని పొంగి పొర్లుతుంది. సింగూరు నుండి నీటిని కిందికి వదలడంతో గురువారం మధ్యాహ్నం నాటికి గణపురం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుకుంది. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండడంతో అనకట్ట పై నుండి నీరు పొంగి పొర్లుతుంది. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వనదుర్గమాత ఉత్సవ విగ్రహన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వరద తగు ముఖం పట్టగానే తిరిగి ఆలయంలో పూజలు తిరిగి నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్డిఓ రమాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న వర్షాలు, వరద ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను ఆదేశించారు.