calender_icon.png 14 August, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంద్రాగస్టు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి..

14-08-2025 08:31:40 PM

జనగామ (విజయక్రాంతి): ఆగస్టు 15వ తేదీన 79వ స్వాతంత్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా గురువారం జనగామ పట్టణంలోని ధర్మ కంచ మినిస్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్(DCP Raja Mahendra Naik) పర్యవేక్షించారు. స్టేజి, గ్యాలరీ ఏర్పాట్లు, జాతీయ పతాకం ఆవిష్కరణ, పరేడ్, ప్రశంస పత్రాల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ, స్టాల్స్ ఏర్పాట్లు వంటివి సందర్శించి పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీఓ గోపిరామ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.