calender_icon.png 14 August, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ

14-08-2025 08:56:09 PM

ఖమ్మం (విజయక్రాంతి): బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు(BJP District President Nellore Koteswara Rao) ఆదేశానుసారం స్థానిక 1-టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ అధ్యక్షతన గురువారం ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేసే దిశగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 1 టౌన్ లో పాదయాత్రగా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి పాలేపు రాము గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికులకు జాతీయ జెండాలను అందించటం జరిగిందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వీరవెల్లి రాజేష్, బండ్ల రిగాన్ ప్రతాప్, పసుమర్తి సతీష్,నెల్లూరి బెనర్జీ,బండారు శ్రీనివాస్, మండల నాయకులు పాలేపు రాము,వెగ్గలం జగదీష్,బొడ్ల శ్రీనివాస్, కడదుల ప్రభాకర్, బాలి బిందు, నాయకులు మేడ సంపత్, లింగరాజు, స్వప్న పాల్గొనటం జరిగింది.