14-08-2025 08:21:44 PM
పెన్ పహాడ్: మండల పరిధిలోని నాగులపాటి అన్నారం, అన్నారం బ్రిడ్జి, దూపాడు గ్రామాలలో గురువారం గ్రామస్తుల ఆరాధ్య డైవం ముత్యాలమ్మ తల్లికి, గ్రామ పొలిమేర అమ్మవార్లకు ఇంటికో బోనం ఎత్తి ఊరేగింపు ద్వారా వెళ్లి గ్రామ దేవతలకు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చిన ముత్యాలమ్మ, బొడ్రాయి దేవతల గద్దెల చుట్టూ కోళ్లు, యాటలు, బోనాలతో ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ పాలకులు లేకపోవడం, పండుగలు చేయడానికి నిధులు సమకూరక పోవడంతో గ్రామానికి చెందిన దాత తండ యల్లయ్య ముందుకు వచ్చి నాగులపాటి అన్నారం, అన్నారం బ్రిడ్జి గ్రామాలలో బోనాల పండుగ, కనకదుర్గమ్మ పండగ అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు దాత తండ యల్లయ్యను ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.