14-08-2025 09:03:21 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని గురువారం సాయంత్రం బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు(CI Srinivasa Rao) సూచించారు. ప్రజలు వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్ళవద్దని కోరారు. వార్డులలో మాజీ కౌన్సిలర్లు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్ళవద్దని, నాళాలు, వాగులు ప్రవహిస్తున్న రహదారులు దాటవద్దన్నారు. చెట్ల కింద, పాడుబడ్డ భవనాల కింద ఉండవద్దని సూచించారు. కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని, చిత్తడిగా మారిన రహదారులపై వాహనాలను నెమ్మదిగా నడపాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సీఐ శ్రీనివాసరావు ప్రజలను కోరారు.